- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, రామన్నపేట: ఎంపీపీ, ఎంపీడీవో ఇరువురు కలిసి అవినీతికి పాల్పడ్డారని ఎంపీటీసీలు ఆందోళన చేసిన సంఘటన రామన్నపేట మండల పరిషత్ కార్యాలయంలో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు బడుగు రమేష్, ఎంపీటీసీలు మాడురి జ్యోతి, ఎండి రేహాన్ శుక్రవారం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో విలేకరులతో మాట్లాడారు.
గత నెల 31న సమాచార హక్కు చట్టం ద్వారా ఎనిమిది మంది ఎంపీటీసీలు కలిసి మండల పరిషత్తు కి సంబంధించిన నిధుల వివరాలు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. మాకు నిధుల వివరాలు ఇవ్వకుండానే ముందస్తుగా అన్ని వాట్సాప్ గ్రూప్ లో ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది విడుదల చేసినట్లు ఆరోపించారు. మండల పరిషత్ సభ్యులు అంటే గౌరవం లేకుండా పోయిందని విమర్శించారు. 2
3 లక్షల రూపాయల నిధులు ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలప్పుడు ఖర్చయినట్లు తెలిపారని అన్నారు. ఎంపీటీసీల ఖర్చు అన్ని గ్రామ పంచాయితీలలో ఖర్చు చేసినట్లు వివరాలు పెట్టారని దీనికి సంబంధించి మా దగ్గర ఆధారాలు ఉన్నాయని తెలిపారు. క్యాష్ బుక్ ప్రకారం లెక్కల వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యాలయం స్టేషనరీ ఖర్చులు, అటెండర్ జీతం కలిపి ఏడు లక్షలు ఖర్చు అయినట్లు చూపడం ఏమిటని ప్రశ్నించారు.
ఎంపీపీ, ఎంపీడీవో ఇరువురు కలిసి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. దాదాపు రూ. 4 లక్షల అవినీతి జరిగినట్లు ఆరోపణలు చేశారు. తిరిగి ఈ రోజు 2017 నుండి నేటి వరకు పూర్తిస్థాయి లెక్కలు చెప్పాలని మరోసారి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా సక్రమంగా సమాచారం ఇవ్వని ఎంపిడిఓ పై కలెక్టర్ కు, పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు.
ఎంపీడీఓ వివరణ..
ఈ విషయమై ఎంపీడీవో జి. జలంధర్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఎంపీటీసీ సభ్యులు సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన మేరకు పూర్తిస్థాయిలో సమాచారం ఇవ్వడం జరిగిందన్నారు. వాట్సాప్ గ్రూప్ లో వివరాలకు సంబంధించి మా కార్యాలయ సిబ్బంది పెట్టడం జరిగిందని అందుకు క్షమాపణ చెబుతున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్క సభ్యుడిని తాను గౌరవిస్తానని ఏ సమాచారం అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తిరిగి మళ్ళీ సమాచార హక్కు చట్టం ద్వారా నిధుల వివరాలు కావాలని అడిగారని త్వరలో పూర్తి సమాచారం సభ్యులకు అందజేస్తానని అన్నారు.






