- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మమతా బెనర్జీ, మహువా మోయిత్రా కి లీగల్ నోటీసులు పంపిన ఎంపీ కాకోలి ఘోష్ కుమారుడు!
మాజీ సీఎం మమతా బెనర్జీ, ఎంపీ మహువా మోయిత్రా సహా పలువురు టీఎంసీ నేతలకు రెబెల్ ఎంపీ కాకోలి ఘోష్ కుమారుడు డాక్టర్ బైద్యనాథ్ లీగల్ నోటీసులు పంపారు. 15 రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఓటమితో అధికారం కోల్పోయిన టీఎంసీ పార్టీ (TMC party) ఒక్కసారిగా రాజకీయ సంక్షోభం లోకి వెళ్లిపోయింది. ఓటమి తర్వాత సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు ఎంపీలు రెబల్ గా మారగా.. మరికొంతమంది పార్టీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి ఊహించని షాక్ తగిలింది. పార్టీ రెబల్ ఎంపీ కాకోలి ఘోష్ దస్తీ దార్ కుమారుడు డాక్టర్ బైద్యనాథ్ ఘోష్ దస్తీ దార్ (Baidyanath Ghosh Dasti Dar).. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎంపీ మహువా మోయిత్రా, కల్యాణ్ బెనర్జీ, సౌగతా రాయ్, సోనాలి గుహాలపై న్యాయపోరాటానికి దిగుతూ లీగల్ నోటీసులు పంపడం బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. బారాసత్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తాను ఎమ్మెల్యే టికెట్ ఆశించానంటూ తృణమూల్ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.
తనకు ఎలాంటి రాజకీయ కాంక్షలు లేవని స్పష్టం చేసిన డాక్టర్ బైద్యనాథ్, కేవలం తన తల్లి పార్టీపై తిరుగుబాటు చేసినందుకే రాజకీయ కక్షతో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన వ్యక్తిగత ప్రవర్తనను, క్యారెక్టర్‌ను దెబ్బతీసేలా మాట్లాడిన టీఎంసీ నేతలు ఈ నోటీసు అందిన 15 రోజుల్లోగా బహిరంగ వివరణ ఇస్తూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తాను బారాసత్ నుంచి ఎలాంటి రాజకీయ నామినేషన్ ఆశించలేదని ఒప్పుకుంటూ ప్రకటన విడుదల చేయాలని, లేని పక్షంలో కోర్టులో పరువు నష్టం దావా ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.






