హైదరాబాద్‌లో ‘సిజెపి’ ధర్నా.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్!

by Malleboina Mahesh |

హైదరాబాద్ ధర్నా చౌక్‌లో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆదివారం ఉదయం భారీ శాంతియుత నిరసన చేపట్టింది.

హైదరాబాద్‌లో ‘సిజెపి’ ధర్నా.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్!
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన నీట్ (NEET) పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై హైదరాబాద్ వేదికగా నిరసన జ్వాలలు మిన్నంటాయి. నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్‌లో ఆదివారం ఉదయం నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ధర్నా చౌక్‌కు పోటెత్తిన యువకులు

పేపర్ లీక్‌ల వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిపోతోందని సీజేపీ పిలుపునిచ్చిన ఈ ధర్నాకు నగరంలోని విద్యార్థులు, యువత, సీజేపీ పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం ఉదయం నుండే ధర్నా చౌక్ పరిసర ప్రాంతాలన్నీ నిరసనకారులతో పోటెత్తాయి. కేంద్ర ప్రభుత్వానికి, ఎన్‌టీఏ (NTA) వైఖరికి వ్యతిరేకంగా ప్లకార్డులు చేతబూని నిరసనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అర్హులైన విద్యార్థులకు న్యాయం జరిగే వరకు, ఈ లీకేజీ ముఠా వెనుక ఉన్న పెద్ద తలకాయలను శిక్షించే వరకు తమ పోరాటం ఆగదని ఈ సందర్భంగా సీజేపీ ముఖ్య నేతలు స్పష్టం చేశారు. అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి డిమాండ్ చేయాలని వారు నినాదాలు చేస్తున్నారు.

Next Story