- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ వర్షం.. నేషనల్ హైవేపై కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
కర్నూల్ జిల్లాను భారీ వర్షం ముంచెత్తింది. శనివారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరోవైపు వేదవతి నదికి భారీగా వరద పోటెత్తింది.

దిశ, వెబ్‌డెస్క్: కర్నూల్ జిల్లాను భారీ వర్షం ముంచెత్తింది. శనివారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరోవైపు వేదవతి నదికి భారీగా వరద పోటెత్తింది. జాతీయ రహదారిపై నీరు చేరడంతో వాహనాలు నిలిచిపోయాయి. శనివారం రాత్రి నుంచి కురిసిన వర్షానికి జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న లోతట్టు వంతెనపై వర్షం నీరు భారీగా ప్రవహించింది. దీంతో ఆలూరు నుంచి బళ్లారి.. బళ్లారి నుంచి ఆంధ్రావైపు వచ్చే వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఆంధ్రా - కర్ణాటక సరిహద్దు ఎగువన కురిసిన వర్షానికి వేదవతి నదికి భారీగా వరదనీరొచ్చి చేరుతోంది. డోన్ కురిసిన ఈదురుగాలులతో కూడిన వర్షానికి విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కడివేళ్లలో కప్పలవాగు పొంగిపొర్లుతుండగా.. పత్తికొండ - ఎమ్మిగనూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఆలూరు - చిప్పగిరి దగ్గర కళ్లెవాగు వంతెనపై వరదనీరు చేరడంతో.. గుంతకల్ - ఆదోని మధ్య రాకపోకలు బందయ్యాయి. హోళగుంద మండలంలో పోతప్ప వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయానికి.. జిల్లాలోని ఆలూరు మండలంలో 9.5 సెంటీమీటర్లు, హోలగుంద మండలంలో 7.5 సెంటీమీటర్లు, దేవనకొండ మండలంలో 5.8 సెంటీమీటర్లు, చిప్పగిరి, హాలహర్వి, ఆస్పరి మండలాల్లో 5.02 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణశాఖ తెలిపింది.






