- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హార్ట్ టచింగ్ లవ్ స్టోరీతో రాబోతున్న అమ్ము అభిరామి.. టైటిల్ పోస్టర్‌తోనే ఆసక్తిని రేకెత్తించిన మేకర్స్
జీవితంలో ఏ క్షణంలోనైనా ఒక అద్భుతం జరగొచ్చు అనే ఒక బ్యూటిఫుల్ పాయింట్‌తో ఈ కథను తెరకెక్కిస్తున్నారు.

దిశ, సినిమా: బ్యూటిఫుల్ హీరోయిన్ అమ్ము అభిరామి తెలుగు, తమిళ భాషల్లో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగులో రాక్షసుడు, నారప్ప, డెవిల్ వంటి చిత్రాలతో అలరించిన ఈ ముద్దుగుమ్మ, గత ఏడాది ప్రభాస్ ‘ది రాజాసాబ్’ సినిమాలోనూ నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె ఒక హార్ట్ టచింగ్ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎమోషనల్ కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. శ్రీలక్ష్మి జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఏఎన్ బాలాజీ నిర్మిస్తున్న ఈ సరికొత్త చిత్రంలో అమ్ము అభిరామి, ‘96’ ఫేమ్ ఆదిత్య భాస్కర్, ఐరా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. హరి ప్రకాష్ ఎం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘జీవితంలో ఏ క్షణంలోనైనా ఒక అద్భుతం జరగొచ్చు’ అనే ఒక బ్యూటిఫుల్ పాయింట్‌తో ఈ కథను తెరకెక్కిస్తున్నారు.
నేటి తరం యూత్‌కు కనెక్ట్ అయ్యే రొమాన్స్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించే ఎమోషన్స్, హిలేరియస్ కామెడీ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు చిత్రబృందం. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభమై చెన్నై, పుదుచ్చేరి వంటి అందమైన ప్రాంతాలలో కీలక షెడ్యూళ్లను పూర్తి చేసుకుంది. త్వరలోనే చివరి షెడ్యూల్‌ను ప్రముఖ హిల్ స్టేషన్ అయిన మున్నార్‌లో జరపడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో, తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘ఫీల్ మై లవ్’ అనే క్లాసిక్ టైటిల్‌ను ఖరారు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెటిజన్లలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.






