మోదీ 12 ఏళ్ల పాలనతో దేశానికి కొత్త దిశ : బీజేపీ నాయకులు

by Batti.Sumithra |

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత 12 ఏళ్లలో దేశాన్ని అభివృద్ధి, సుపరిపాలన, సంక్షేమ రంగాల్లో ముందంజలో నిలిపిందని బీజేపీ నాయకులు పేర్కొన్నారు.

మోదీ 12 ఏళ్ల పాలనతో దేశానికి కొత్త దిశ : బీజేపీ నాయకులు
X

దిశ, చంపాపేట్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత 12 ఏళ్లలో దేశాన్ని అభివృద్ధి, సుపరిపాలన, సంక్షేమ రంగాల్లో ముందంజలో నిలిపిందని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు నిరంజన్ యాదవ్ ఆధ్వర్యంలో ఐఎస్ సదన్ పరిధిలోని వినయ్‌నగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పలువురు నేతలు పాల్గొని కేంద్ర ప్రభుత్వ విజయాలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ "సబ్కా సాథ్ – సబ్కా వికాస్ – సబ్కా విశ్వాస్ అనే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం దేశంలోని ప్రతి వర్గం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తోందన్నారు. పేదలు, రైతులు, మహిళలు, యువత సాధికారత కోసం అనేక పథకాలను అమలు చేసి సామాజిక, ఆర్థిక అభివృద్ధికి బాటలు వేసిందని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విశేష సహకారం అందించిందని, జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, విద్యాసంస్థలు, మౌలిక సదుపాయాల కల్పనకు లక్షల కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని వివరించారు. కేంద్ర సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాల ద్వారా దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక శక్తిగా ఎదుగుతోందని చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్, పీఎం కిసాన్ వంటి పథకాల ద్వారా కోట్లాది కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని తెలిపారు. మోదీ ప్రభుత్వ 12 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలను ప్రజలకు చేరవేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు, సమావేశాలు, మేధావుల సమ్మేళనాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ పనితీరు పై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని, ఈ ప్రజాభిమానంతో 2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చి డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సురేందర్ రెడ్డి, యాకుత్‌పురా ఇన్‌చార్జ్ వీరేందర్ యాదవ్, నరసింహ, మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చంద్రజీ, అధికార ప్రతినిధి చికోటి ప్రవీణ్, జిల్లా మీడియా ఇన్‌చార్జ్ ప్రభ, దశరథ లక్ష్మి, మహేష్ శ్రీనాథ్, నవీన్ బండారి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Next Story