తుని చిన్నారి మిస్సింగ్ కేసు.. రంగంలోకి NDRF

by Naga Rani Yarlagadda |

తుని చిన్నారి మిస్సింగ్ కేసు.. రంగంలోకి NDRF
X

దిశ, వెబ్‌డెస్క్: కాకినాడ జిల్లా తునిలో జ్ఞానేశ్వరి అలియాస్ జాహ్నవి అనే చిన్నరి మిస్సై 9 రోజులైనా ఇంకా ఆచూకీ దొరకలేదు. జూన్ 6వ తేదీన మిస్సైన చిన్నారి జాడ కోసం పోలీసులు అడుగడుగునా జల్లెడ పట్టినా ఒక్క క్లూ కూడా దొరకలేదు. మిస్సింగ్ కేసులో కీలక ఆధారంగా భావించిన పెంపుడు కుక్క సైతం తీవ్రమైన అనారోగ్యంతో నిన్న (శనివారం) మరణించడంతో.. ఉన్న ఒక్కదారి మూసుకుపోయినట్లైంది. కుక్క మరణంతో.. జ్ఞానేశ్వరి ఆచూకీ కనుగొనడం పోలీసులకు కత్తిమీద సాములా మారింది. తాజాగా చిన్నారి ఆచూకీని కనుగొనేందుకు NDRF రంగంలోకి దిగింది. SDRF, అటవీశాఖ సిబ్బందితో కలిసి గాలింపు చర్యలను ముమ్మరం చేయనుంది. పోలీసులు అధునాతన డ్రోన్ల సహాయంతో అడవిని జల్లెడ పడుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత.. చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ పై జిల్లా ఎస్పీతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత పరిస్థితిపైనా ఆరా తీశారు. కాగా.. అనారోగ్యంతో చనిపోయినట్లు భావిస్తున్న పెంపుడు కుక్కకు నేడు పోస్టుమార్టం చేయనున్నారు. కుక్కపై ఎవరైనా దాడిచేశారా? ఉన్నట్లుండి కుక్క చనిపోవడానికి కారణాలేంటో పోస్టుమార్టంలో తేలనుంది.

Next Story