- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పర్యాటకులకు నిరాశ.. పాపికొండల విహారయాత్రకు బ్రేక్
గోదావరి నదిలో పర్యాటక బోట్ల నిర్వహణపై పర్యాటకుల భద్రతా పరమైన ఆందోళనలు వస్తున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: పాపికొండల విహారయాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రంపచోడవరం ఆర్డీఓ స్వాతి తెలిపారు. గోదావరి నదిలో పర్యాటక బోట్ల నిర్వహణపై పర్యాటకుల భద్రతా పరమైన ఆందోళనలు వస్తున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దేవీపట్నం మండలం గండిపోశమ్మ అమ్మవారి ఆలయం నుంచి ఇటీవల సుమారు 89 మంది పర్యాటకులు పాపికొండల విహారయాత్రకు వెళ్లారు. బోటు దేవీపట్నం ఓల్డ్ పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లేసరికి.. టెక్నికల్ సమస్య వచ్చింది. దీంతో బోటు సరంగు వెంటనే దానిని నిలిపివేశాడు. ఈ మేరకు మీడియాలో వార్తలు రావడంతో పాపికొండల యాత్రకు వెళ్లాలనుకున్న పర్యాటకులు ఆందోళన చెందారు. నది మధ్యలో బోటు నిలిచిపోవడంతో విహారయాత్రకు వెళ్లే పర్యాటకులు సేఫ్టీపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పాపికొండల విహారయాత్రను నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. బోట్ల ఫిట్నెస్, భద్రతా ప్రమాణాలను పరిశీలించి, నివేదిక ఇచ్చాకే వాటికి అనుమతులు ఇస్తామని తెలిపారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.






