ఇంటర్నేషనల్ ఐకాన్ అవార్డ్స్ బ్రోచర్లను ఆవిష్కరించిన ఎంపీ డీకే అరుణ

by Jakkula.Mamatha |

మాస్టర్ కేశవ్ కరాటే అకాడమీ ఇంటర్నేషనల్ ఫౌండర్, ప్రెసిడెంట్ కేశవ్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఇంటర్నేషనల్ ఐకాన్ అవార్డ్స్ - 2026 బ్రోచర్లను శుక్రవారం జిల్లా కేంద్రంలో ఎంపీ డీకే అరుణ ఆవిష్కరించారు.

ఇంటర్నేషనల్ ఐకాన్ అవార్డ్స్ బ్రోచర్లను ఆవిష్కరించిన ఎంపీ డీకే అరుణ
X

దిశ, జడ్చర్ల: మాస్టర్ కేశవ్ కరాటే అకాడమీ ఇంటర్నేషనల్ ఫౌండర్, ప్రెసిడెంట్ కేశవ్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఇంటర్నేషనల్ ఐకాన్ అవార్డ్స్ - 2026 బ్రోచర్లను శుక్రవారం జిల్లా కేంద్రంలో ఎంపీ డీకే అరుణ ఆవిష్కరించారు. మాస్టర్ కేశవ్ గౌడ్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మొదటిసారిగా తమ అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఈ నెల 9వ తేదీన ఇంటర్నేషనల్ ఐకాన్ అవార్డ్స్ - 2026 కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ బ్రూస్ లీ అవార్డు , ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ బుద్ధా అవార్డు, ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ నంది అవార్డు, ఇంటర్నేషనల్ స్టార్ కిడ్ అవార్డు, ఇంటర్నేషనల్ మహా నటరాజ్ అవార్డు, ఇంటర్నేషనల్ yoga అవార్డు, ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ అవార్డులు అందజేసి సత్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో గౌరీశంకర్, రాజేష్, మురళి తదితరులు పాల్గొన్నారు.

Next Story