- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీడీపీ ఫ్లోర్ లీడర్ పై ఎంపీ చామల ఫైర్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై తప్పుగా మాట్లాడితే ఊరుకోమని భువనగిరి ఎంపీ, చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : లోక్ సభలో టీడీపీ ఫ్లోర్ లీడర్ లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలంగాణ ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలకు భువనగిరి ఎంపీ, చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లావు శ్రీ కృష్ణ దేవరాయలు తెలంగాణ ఏర్పాటుపై మాట్లాడిన మాటలను ఖండిస్తున్నానని, కానీ, రాజ్యంగ బద్దంగా లోక్ సభలో తెలంగాణ బిల్లు పాస్ అయిందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతుగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు లేఖ ఇచ్చారని, ఆ విషయం కృష్ణదేవరాయలకు తెలియదా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.
సుష్మాస్వరాజ్ లోక్ సభలో తెలంగాణ గురించి మాట్లాడారని బీజేపీ వాళ్ళు ఇప్పటికీ గొప్పలు చెప్పుకుంటున్నారని, రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్ళు అయిందని, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పు పట్టడం ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చరిత్రను టీడీపీ ఎంపీ తప్పుగా మాట్లాడటం సరికాదని, ఎవరి ప్రసన్నం కోసమో ప్రజల సెంటిమెంట్ ను రెచ్చగొట్టవద్దని కిరణ్ కుమార్ రెడ్డి హితవు పలికారు. మరోసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై తప్పుగా మాట్లాడితే ఊరుకోమని, లోక్ సభలో మరోసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా మాట్లాడవద్దని ఆయన స్పష్టం చేశారు.






