ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలి: ఎంపీ బండి సంజయ్

by Web Desk |

ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలి: ఎంపీ బండి సంజయ్
X

దిశ, వేములవాడ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ నేడు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. అనంతరం భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ఇబ్బందులను గమనించారు. అనంతరం అన్నదాత సత్రాన్ని సందర్శించారు. ప్రత్యేక వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. వేముల‌వాడ కోసం రూ. వంద కోట్లు కేటాయిస్తామ‌ని చెప్పి ఇంత‌వ‌ర‌కు ఇవ్వకపోవడం ఏమిటి అని ప్రశ్నించారు. వేములవాడ‌లో సౌక‌ర్యాలు స‌రిగా లేవ‌ని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఏక‌ప‌క్ష నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని విమ‌ర్శించారు. రాష్ట్ర స‌మ‌స్యలను ప‌క్కన పెట్టి జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పుతాన‌ని చెప్పడం విడ్డూరంగా ఉంద‌న్నారు.

బ‌డ్జెట్ స‌మావేశాల‌కు గ‌వ‌ర్నర్‌ను ఆహ్వానించ‌క‌పోవ‌డం ఏమిట‌ని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స‌భా నిర్వహణలో సైతం రాజ‌కీయాలు చూస్తున్నార‌ని ఎద్దేవా చేశారు. ఎంద‌రు పీకేలు వ‌చ్చినా కేసీఆర్ కు విజ‌యం ద‌క్కదని జోస్యం చెప్పారు. అందుకే కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల వైపు చూస్తున్నట్లు తెలుస్తోంద‌న్నారు. ఇప్పటికైన ప్రజల కోసం ప‌ని చేయాల‌ని సూచించారు.

Next Story