- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
పర్యావరణం- విరిగిన వాక్యం!
**
హిస్స్, హిషస్, హిస్!
చూసారా మేము విరిగిన వ్యాకరణాలమి!
*
చూడు ! నీకు పాలు కావాలి!
దాని కోసం,నీ ఆవులకి నొప్పి పోగొట్టే డైక్లోఫెనాక్ మందులు వేస్తావు!
నువ్వు పర్యావరణం అనే వాక్యాన్ని విరగ్గొట్టావు
లేదా అర్థం తప్పించావు!
*
ఇప్పుడు, మేమంతా మృతులం!
నువ్వు కూడా మాలాగా వాసన వేస్తున్నావు!
కుళ్ళిన ఆవుల శవాల ఖంపు నీ జ్ఞాపకాలలో నిక్షిప్తమైన గాఢమైన వాసనని గుర్తుకు చేస్తుంది!
*
ఎవరు చచ్చారిప్పుడు?
చచ్చిందెవరో చెప్పు?
వ్యాకరణం_వాక్యం_పర్యావరణం!
ఇవి కదా చచ్చిపోయాయి మరి?
అందుకే ఇవన్నీ తెగ కంపు కొడుతున్నాయి!
ఈ విరిగిన లేదా అర్థం మారిన వాక్యాల ఆత్మ శాంతించుగాక!
(చచ్చిన రాబందుల సామూహిక గీతం ఆగిపోయింది)
ఇంగ్లీష్ మూలం మౌమితా ఆలం.
తెలుగు అనువాదం గీతాంజలి.
Next Story






