"పంట కాలాల ఫ్యాక్టరీ కార్మికుడు మునియాకి ప్రేమతో"!

by Muthe.Rajitha |

"పంట కాలాల ఫ్యాక్టరీ కార్మికుడు మునియాకి ప్రేమతో"! - మౌమితా ఆలం

పంట కాలాల ఫ్యాక్టరీ కార్మికుడు మునియాకి ప్రేమతో!
X

"పంట కాలాల ఫ్యాక్టరీ కార్మికుడు మునియాకి ప్రేమతో"!

~~~~

"బాలల దినోత్సవ శుభాకాంక్షలు"!

అని తరగతి గదిలో బ్లాక్ బోర్డు మీద రాసాను!

మిగతా పిల్లలాగా మునియా సంతోషంగా చప్పట్లు కొట్టలేదు!

~~~

"మునియా చప్పట్లేందుకు కొట్టట్లేదు"?

మునియా ని అడిగాను.

రేపు నేను అమ్మా నాన్న లతో కలిసి ఇటుక ఫ్యాక్టరీ కి పనికి వెళ్లిపోతున్నాను.

నాకు ఐదేళ్ళప్పటినుంచీ,ప్రతి ఏడాదీ వాళ్ళతోనే వెళుతున్నాను!

నేను కూడా చిన్న పిల్లవాడినా టీచర్?

~~~

మునియా అడిగిన ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు!

ఇంగ్లీష్ మూలం మౌమితా ఆలం.

తెలుగు అనువాదం గీతాంజలి.





Next Story