భవిష్యత్తు పిల్లల కోసం ఒక సలహా!

by Muthe.Rajitha |   (  Updated:2026-03-12 17:30:06  IST  )

భవిష్యత్తు పిల్లల కోసం ఒక సలహా!

భవిష్యత్తు పిల్లల కోసం ఒక సలహా!
X

భవిష్యత్తు పిల్లల కోసం ఒక సలహా!

~~

ప్రపంచ పిల్లలారా!

మీ రెండు చేతులు కలాష్నికోవ్ (AK 47)

లాంటి గన్స్ తో పుట్టండి!

మీ రెండు కళ్ళ బదులు సజీవమైన గ్రైనేడ్లు ఉండాలి!

మరి డ్రోన్ల లాంటి రెండు కాళ్ళేసుకొనే పుట్టాలి మీరు!

ప్రపంచం ఇప్పుడొక యుద్ధ క్షేత్రం!

చంపడం నేర్చుకోండి

లేకపోతే మీ మూలుగు కూడా వినపడనియ్యకుండా మీరు చంపబడతారు!

**

భారతదేశంలోని పిల్లల కోసం ఒక సలహా!

పిల్లలారా ! ఇప్పుడు మీరు నేర్చున్నవి వదిలేసే సమయం మొదలైంది!

ఇక ఉదయమే నిద్ర నుంచి మిమ్మల్ని లేపడానికి పక్షులు పాడబోవు!

చేపలు పట్టటానికి వెళ్ళిన మీ పొరుగు వాళ్ళు ఖాళీ బుట్టలతో వెనక్కి వస్తారు!

~~

చేపలు దొరక్క వాళ్ళు విలపించినప్పుడు ,

పిల్లలూ వాళ్ళని ఇలా అడగండి!

పర్వతాలను ఎవరు నమిలి మింగేస్తున్నారు?

నదులు ఎందుకు ఎండిపోతున్నాయి?

అరణ్యాలన్నీ ఎక్కడికి తరలి పోయాయి?

అని అడగండి వాళ్ళని!

వాళ్ళు సమాధానం చెప్పరు!

~

అప్పుడిక,వాళ్ళందరి నాలుకలని పరీక్షించండి!

వాళ్ళ నాలుకలన్నీ కూడా

ఇనుము,బాక్సైట్,యురేనియం ఖనిజాలతో బరువెక్కిపోయి ఉంటాయి!

అప్పుడిక మీకే అర్థం అవుతుంది.

పర్వతాలూ,నదులూ, అడవులూ ఏమయ్యాయో?

~

అందుకే పిల్లలూ., ఆ

మీరిప్పుడు గతంలో ప్రకృతి గురించి నేర్చుకున్నవన్నీ వదిలేయడం నేర్చుకోవాలి!

***

ఇంగ్లీష్ మౌమిత ఆలం

తెలుగు అనువాదం గీతాంజలి





Next Story