"నా మాతృభాష"!

by Muthe.Rajitha |

మీకు తెలుసా! నేను నాలుగు భాషల్లో మాట్లాడగలను!

నా మాతృభాష!
X

"నా మాతృభాష"!

~

మీకు తెలుసా! నేను నాలుగు భాషల్లో మాట్లాడగలను! నా ప్రియుడు నా వక్షోజాలను మలయాళం లో ముద్దు పెట్టుకుంటాడు! నేను అతన్ని ఇంగ్లీషులో కౌగిలించుకుంటాను! అతడు నా నాభిని రుద్దినప్పుడు నేను బెంగాలీ భాషలో నా చర్మం మీది ఆ స్పర్శని అనుభూతి చెందుతాను! నా ప్రియుడి స్పర్శకి నేను మూల్గిన ప్రతీసారీ, కామటాపురి భాషలో మూలుగుతాను!

**. ఇక తెల్లవారుజామున మా పూరి పాక ఛత్ కింద మా అమ్మ మూల్గుల భాషను వింటాను.

ఆ క్షణాల్లో మా నాన్న మా నిద్రా భంగం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటాడు అనుకోండి! శృంగారం చేసుకున్న తర్వాత, నా శరీరం అనుభవించిన భావప్రాప్తి కామటాపురి భాషలోనే ఉంటుంది మరి!

~~

మూలం మౌమితా ఆలం!

అనువాదం- గీతాంజలి

(నోట్: నార్త్ బెంగాల్లో కామఠాపురి అనే భాష చాలా మంది మాట్లాడుతుంటారు. 2018లో వెస్ట్ బెంగాల్లో కామఠాపురి లేదా రాగ్ బన్షి భాష అధికారికంగా గుర్తించబడింది. అయినా ప్రధాన స్రవంతి కమ్యూనిటీ మాత్రం ఈ భాషని స్వచ్ఛమైన భాషగా కాకుండా, అసహ్యకరమైన భాషగా మాత్రమే చూస్తుంది.)

Next Story