నేను నిషేదానికి గురికాబడ్డ కవయిత్రిని!

by Muthe.Rajitha |

నేను నిషేదానికి గురికాబడ్డ కవయిత్రిని!

నేను నిషేదానికి గురికాబడ్డ కవయిత్రిని!
X

నేను నిషేదానికి గురికాబడ్డ కవయిత్రిని!

ఇంగ్లీష్ మూలం -మోమిత ఆలం.

తెలుగు అనువాదం గీతాంజలి.

***

అవును నేను నిషేధానికి గురికాబడ్డ కవయత్రిని ! నువ్వు చూడలేనివి అన్నీ నేను చూస్తాను!

కాబట్టి నేను బహిష్కరణకు గురికాబడ్డ కవయిత్రిని!

***

తన ఇల్లైన అడవిలోకి ప్రవేశించడానికి అనుమతి దొరకని, దేహమంతా ముడతలు పడ్డ ఆదివాసి స్త్రీ ని చూడగలను!

ఆమె ఎప్పటిలా అడవిలో తన ఆదిమకాలం నాటి పెద్ద వృక్షాన్ని పూజించాలనుకుంటుంది!

కానీ అదుపుతప్పిన నల్లని పొగ వెద జల్లే గనులను తవ్వే యంత్రాలు ఆమె కళ్ళని కమ్మి చిరాకు పెడతాయి.

అడవిలో గూళ్లు దొరకని పక్షులు వాటి చివరి ప్రయాణానికి సిద్ధమై ఎగిరిపోతాయి!

ఆ దిక్కులేని పక్షులను,చెట్లు కోల్పోయిన ఆదివాసీ స్త్రీలను నేను మాత్రమే చూస్తాను మరి!

****

అవును!నేను నిషేధానికి గురికాబడ్డ కవయత్రిని!

ఎందుకంటే.,తేయాకు తోటల కూలీ వాళ్ళు అతి తక్కువ తిండి దినుసులతో,వర్షపు తడికి ముడుతలు పడ్డ చేతి వేళ్ళతో గొడుగును గట్టిగా పట్టుకుని ఉదాసీనంగా ఇళ్ళకి తిరిగి వెళ్లడం చూస్తాను!

రోజుకి రెండువందల యాభై రూపాయల సంపాదన వాళ్ళకో పెద్ద కల మరి!

****

ఇంకా నేను దూరాన ఉన్న కాసర్గోడ్ సిమెంట్ ఫ్యాక్టరీ లో పని చేస్తూన్న భర్తలతో, దుఃఖం తో వీడియో కాల్ మాట్లాడే భార్యలను కూడా చూస్తాను!

తమ భర్తలకు వొళ్లంతా సిమెంటు ధూళితో వచ్చిన చర్మ వ్యాధి ఎక్జిమా కి మంచి క్రీమ్ రాసుకొని బాధ తగ్గించు కొమ్మని వేడుకునే భార్యలని చూస్తాను!

***

అవును,అందుకే నేను నిషేధానికి గురి కాబడ్డ కవయత్రిని!

నా కళ్ళు ఎప్పుడూ తెరుచుకునే ఉంటాయి! నేను నువ్వు చూడలేనివి చూస్తాను మరి!

Next Story