- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

చేపలు ఎక్కడికి వెళతాయి?
~~~
మాకు చాలా కావాలి!
అవును చాలా అధికంగా కావాలి!
భయంకరమైన రీతిలో మాకు కావాల్సిందే!
అంతులేకుండా,అనంతంగా మాకు కావాలి!
**
తన జాతిలో చిట్ట చివరి చేపలు పట్టేవాడైన బిష్ణు,
తన స్వప్నాల్లో నీటి కొలనులను చూస్తాడు!
ప్రతీ రోజు రాత్రి ఆకాశమంత ఎత్తుకు లేచిన అపార్టుమెంట్ల దగ్గరికి వెళ్ళి వాటిని నోరారా శపిస్తాడు!
**
కిందికి వంగి భూమికి చెవులునానించి ,
అతను బిల్డింగ్ కింద రసాయనాలు ఎక్కువై నేలలో చిక్కుకు పోయిన చేపలు చేసే సడిని నిస్సహాయంగా వింటాడు!
**
పిల్లర్లను తోసేస్తూ బిల్డింగ్ లను కదల్చాలని చూస్తాడు ఆ చేపలు పట్టేవాడు!
ఎంతగా అంటే,ఊపిరి ఆగిపోయేంతగా, అతని చేతుల నుంచి రక్తాలు కారెంతగా అన్నమాట!
*
ఉదయాన్నే దారిన వెళ్ళే బాటసారి,చేపలు పట్టేవాడు మరణించి ఉండడాన్ని చూస్తాడు!
ఆ వెర్రి చేపలు పట్టేవాడికోసం ఎవరూ ఏడవరు!
ఏడవాలంటే., చనిపోయినవాడు బాగా ధనవంతుడై ఉండాలి!
బిష్ణు డబ్బున్నవాడేమి కాడు మరి!
ఎవరేడుస్తారని చేపల కోసం, కొలను కలలు కన్న ఆ నిర్భాగ్యుడి కోసం?
కేవలం అతని పిడికిట్లో మిగిలి ఉన్న ఇసుక తప్ప?
-ఇంగ్లీష్ మూలం మౌమితా ఆలం
తెలుగు అనువాదం గీతాంజలి






