- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కప్పలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి?
మౌమితా ఆలం ఎలిజీలు

కప్పలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి?
**
ఎక్కడో దూరాలనుంచి అర్థరాత్రి మూలుగులు వినిపిస్తున్నాయి.
పాడైపోతున్న మామిడి చెక్కతో చేసిన మంచం నుంచి కలుక్కు మనే శబ్దం వినిపిస్తున్నది!
ఆడ కప్ప కోసం మగ కప్ప వేసే కేకలు కూడా వినిపిస్తున్నాయి !
*
మంచి రోజులపై ఉన్న ఆశలన్నీ మనుషులలో మాయమైపోతున్నాయి!
నిరుద్యోగపు వెతుకులాటలో అలిసిపోయిన మనసూ, దేహం రెండూ ఖాళీ కడుపుతో ఉదయానందాన్ని అనుభవిస్తూ జడంగా పడి ఉన్నాయి.
*
ఓహ్!మంచం తన దేహాన్ని, అస్థిపంజరాన్నీ కోల్పోయింది!
కప్పలన్నీ చనిపోయాయి!
*
వర్షాలన్నీ పురుగుల మందులతో ఉన్న నురుగును మరింతగా
కుళ్ళబెడుతున్నాయి!
**
మహా నగరపు బస్తీలో ఇంకా చెమ్మ బారి శిథిలమైన గది తాళం వేయకుండానే తెరిచి ఉంది!
జమీలా శూన్యపు చూపులు నేలకి వాలిపోతూ ఉన్నాయి!
ఈ మధ్యకాలంలో ఆమె దగ్గరికి ఒక్క కస్టమర్ కూడా రావడం లేదు మరి.
**
అవునూ,ఇంతకీ కప్పలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి?
- ఇంగ్లీష్ మూలం మౌమితా ఆలం.
తెలుగు అనువాదం గీతాంజలి.






