- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దోమ మండలంలో ఏసీబీ దాడులు.. అవినీతి జీపీఓ అరెస్ట్
by Batti.Sumithra |
దోమ మండలం మోత్కూర్ గ్రామ జీపీఓ జగదీశ్ సోమవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టు పడ్డాడు.

X
దిశ, దోమ : దోమ మండలం మోత్కూర్ గ్రామ జీపీఓ జగదీశ్ సోమవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టు పడ్డాడు. పలువురు తెలిపిన వివరాల ప్రకారం మోత్కూర్ గ్రామానికి చెందిన పలువురు కళ్యాణ లక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకోగా లబ్ధిదారులను మోత్కూర్ జీపీఓ జగదీశ్ రూ.6 వేలు లంచం డిమాండ్ చేయడంతో గ్రామానికి చెందిన బాధితులు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించి న్యాయం కోరారు. సోమవారం జరిగిన ఆకస్మిక తనిఖీలలో మోత్కూర్ జీపీఓ జగదీశ్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ప్రజాధనం దోచుకునే ఇలాంటి అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






