మహిళల సమగ్ర అభ్యున్నతే లక్ష్యం: జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు

by Kodari Anjali |

మహిళల సమగ్ర అభ్యున్నతే లక్ష్యంగా జాతీయ మహిళా సమాఖ్య పనిచేస్తుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తేల సృజన అన్నారు.

మహిళల సమగ్ర అభ్యున్నతే లక్ష్యం:  జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు
X

దిశ, హుజూర్ నగర్ టౌన్: మహిళల సమగ్ర అభ్యున్నతే లక్ష్యంగా జాతీయ మహిళా సమాఖ్య పనిచేస్తుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తేల సృజన అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో జాతీయ మహిళా సమాఖ్య నాలుగోవ జిల్లా మహాసభలను నిర్వహించారు. జాతీయ మహిళా సమాఖ్య జెండాను ఆవిష్కరించిన తరువాత జరిగిన సభలో సృజన మాట్లాడుతూ, ప్రభుత్వాలు మహిళల సమస్యలను వెను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళల పరిస్థితి సమాజంలో ఇంకా సవాళ్లతో కూడుకొని ఉన్నదని వారికి విద్య వైద్యం ఉపాధి అవకాశాలను విస్తరించాల్సిన ఆవశ్యకతను తెలిపారు. లైంగిక వేధింపులు, వివక్షతలు స్త్రీలను వదిలిపెట్టడం లేదని తెలిపారు.

సంక్షేమ పథకాల వల్ల సాధ్యం కాదని..

కార్పొరేట్ వ్యవస్థలలో కూడా మహిళలకు సమాన అవకాశాలు వేతనాలు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. నేటికీ మహిళలు మాతృత్వం కోసం కెరీయర్ ని వదులుకోవాల్సి వస్తుందన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, స్త్రీలపై హింస, భద్రతా లోపాలు, వివక్షతలాంటి అంశాలు కొనసాగడం సమాజానికి అంత మంచిది కాదన్నారు. మహిళల అభ్యున్నతి ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల వల్ల సాధ్యం కాదని వారి ఆర్థిక స్వాలంబన కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.జిల్లా అధ్యక్షురాలు ఉప్పతల కోటమ్మ,పట్టణ అధ్యక్షురాలు యల్లావుల ఉమా, అయిలాపురం లక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దేవరం మల్లేశ్వరి, సింగినం పుల్లమ్మ,సుందరి పద్మ, సిపిఐ పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, బద్దం కృష్ణారెడ్డి, కెవిఎన్ మూర్తి, ధూళిపాల ధనుంజయ నాయుడు, పోకల వెంకటేశ్వర్లు, కొప్పోజు సూర్యనారాయణ, ఇందిరాల వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ చేన్నగాని సైదులు, యల్లావుల రమేష్, జక్కుల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Next Story