Infosys: ఇన్ఫోసిస్‌కు రూ. 2 కోట్ల జరిమానా విధించిన ఫ్రాన్స్

by S Gopi |

ఉద్యోగుల పని వేళలను నమోదు చేసే వ్యవస్థ అక్కడి కార్మిక చట్టాలకు పూర్తిగా అనుగుణంగా లేదని తేలడంతో, ఫ్రెంచ్ కార్మిక శాఖ విభాగం సంస్థపై జరిమానా విధించింది.

Infosys: ఇన్ఫోసిస్‌కు రూ. 2 కోట్ల జరిమానా విధించిన ఫ్రాన్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఐటీ సేవల కంపెనీ ఇన్ఫోసిస్‌కు ఫ్రాన్స్‌లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉద్యోగుల పని వేళలను నమోదు చేసే వ్యవస్థ అక్కడి కార్మిక చట్టాలకు పూర్తిగా అనుగుణంగా లేదని తేలడంతో, ఫ్రెంచ్ కార్మిక శాఖ విభాగం సంస్థపై 1,75,000 యూరోల(మన కరెన్సీలో రూ. 2 కోట్ల) జరిమానా విధించింది. స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో ఇన్ఫోసిస్ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, కొన్ని వర్గాల టైమ్ రికార్డింగ్‌లో విశ్వసనీయత, ఆడిట్ చేయగల సామర్థ్యం, పర్యవేక్షణ వంటి అంశాల్లో లోపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారని తెలిపింది. అయితే ఈ జరిమానా తమ ఆర్థిక పరిస్థితి, వ్యాపార కార్యకలాపాలు లేదా మొత్తం పనితీరుపై ప్రభావం ఉండదని కంపెనీ స్పష్టం చేసింది. ఇదే సమయంలో వ్యాపార పనితీరుకు సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో ఇన్ఫోసిస్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 12.2 శాతం పెరిగి రూ. 7,769 కోట్లకు చేరగా, కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 14 శాతం పెరిగి రూ. 48,211 కోట్లకు చేరింది.

Next Story