మల్కాజ్‌గిరి సీఐగా విజయ్ కుమార్ బాధ్యతల స్వీకారం

by Taduka Kalyani |

మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా విజయ్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.

మల్కాజ్‌గిరి సీఐగా విజయ్ కుమార్ బాధ్యతల స్వీకారం
X

దిశ, మల్కాజ్‌గిరి : మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా విజయ్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు సీఐగా విధులు నిర్వహించిన సత్యనారాయణను ఆర్థిక నేరాల విభాగం (ఈ ఓ డబ్ల్యు)కు బదిలీ చేయగా, ఉప్పల్ సీసీఎస్‌ నుంచి విజయ్ కుమార్‌ను మల్కాజ్‌గిరికి నియమించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం విజయ్ కుమార్ మాట్లాడుతూ, మల్కాజ్‌గిరిలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ, ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసింగ్ అందిస్తామని చెప్పారు. ప్రజల సహకారంతో సమర్థవంతమైన పోలీసు సేవలు అందించి, శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.

Next Story