కొడుకు, కూతుర్ని బావిలో తోసి తల్లి ఆత్మహత్య

by Jakkula.Mamatha |   (  Updated:2026-07-17 04:03:07  IST  )

కొడుకు, కూతురుని బావిలో తోసి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన నగర శివారు శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

కొడుకు, కూతుర్ని బావిలో తోసి తల్లి ఆత్మహత్య
X

దిశ, చేవెళ్ల: కొడుకు, కూతురుని బావిలో తోసి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన నగర శివారు శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కొడంగల్ నుంచి వచ్చిన సుధాకర్, వసంత(35) దంపతులు కొత్తపల్లిలో స్థిరపడ్డారు. రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగి తల్లి, కూతురు నవ్య(15), 10 ఏళ్ల కుమారుడిని బావిలోకి తోసి తానూ దూకింది. కాగా బాలుడు చెట్టు కొమ్మకు చిక్కుకొని తప్పించుకున్నాడని సమాచారం. మృతదేహాలను బయటకు తీస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story