గుండె ధైర్యం ఉన్నవాళ్లే చూడండి.. Aసర్టిఫికెట్‌తో భయపెట్టేందుకు వస్తున్న ‘డీమాంటీ కాలనీ-3’

by Mallepaka Hamsa |   (  Updated:2026-07-17 05:08:44  IST  )

అయితే ఈ సినిమాలో రమేష్ తిలక్, సనంత్, అభిషేక్ జోసెఫ్ జార్జ్, హెలెన్ టేలర్, సింగంపులి, ఎంఎస్ భాస్కర్, ప్రముఖ కామెడీ నటుడు యోగిబాబు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

గుండె ధైర్యం ఉన్నవాళ్లే చూడండి.. Aసర్టిఫికెట్‌తో భయపెట్టేందుకు వస్తున్న ‘డీమాంటీ కాలనీ-3’
X

దిశ, సినిమా: సక్సెస్‌ఫుల్ హారర్ ఫ్రాంచైజీగా పేరు తెచ్చుకున్న ‘డిమాంటీ కాలనీ’ సిరీస్‌ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక దీనికి సీక్వెల్ తెనకెక్కించగా.. బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. దీంతో ఇప్పుడు ఈ సిరీస్‌లో మూడో భాగంతో ప్రేక్షకులను మరోసారి వణికించేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. అరుళ్ నిధి, ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘డిమాంటీ కాలనీ-3’ . ‘కోబ్రా’, ‘డిమాంటీ కాలనీ’ మొదటి భాగాలకు దర్శకత్వం వహించిన అజయ్ జ్ఞానముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈసారి సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ సరికొత్త కోణంలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమాలో రమేష్ తిలక్, సనంత్, అభిషేక్ జోసెఫ్ జార్జ్, హెలెన్ టేలర్, సింగంపులి, ఎంఎస్ భాస్కర్, ప్రముఖ కామెడీ నటుడు యోగిబాబు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇంతకుముందు ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 11న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తైనట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా మూవీ మేకర్స్ ప్రేక్షకులకు ఒక క్రేజీ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్ జారీ చేసింది. అంటే సినిమాలో భయపెట్టే సీన్స్ చాలా గట్టిగానే ఉన్నట్లు అర్థమవుతోంది. దీంతో పాటు, ముందుగా అనుకున్న తేదీ కంటే ఒకరోజు ముందుగానే, అంటే సెప్టెంబర్ 10నే ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. "చీకటి తిరిగి వచ్చింది.. ఇది గుండె ధైర్యం లేనివారికి కాదు.. సెప్టెంబర్ 10న చీకటి మళ్లీ వస్తోంది, సిద్ధంగా ఉండండి" అనే క్యాప్షన్ జత చేస్తూ ఓ వీడియోను కూడా పెట్టారు.

Next Story