- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య
by Batti.Sumithra |
వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం అడవి వెంకటాపూర్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, కుల్కచర్ల : వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం అడవి వెంకటాపూర్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా మనస్తాపానికి గురైన ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులను ఉరివేసి చంపి, అనంతరం తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అడవి వెంకటాపూర్ గ్రామానికి చెందిన జంబుల మల్లేష్ (32), ఆయన భార్య జంబుల నవనీత (సునీత) (27) దంపతులకు కుమారుడు విఘ్నేష్ (7), కుమార్తె మధుప్రియ (5) ఉన్నారు. కుటుంబంలో తరచూ జరుగుతున్న గొడవలతో మనస్తాపానికి గురైన నవనీత ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు, తల్లి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






