- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బంగారంపై మరిన్ని ఆంక్షలు!
రానున్న ఆర్థిక మాంద్యాన్ని తట్టుకునేందుకు గోల్డ్ పై మరిన్ని ఆంక్షలు విధించేందుకు సిద్ధం అయింది కేంద్ర ప్రభుత్వం

దిశ, వెబ్ డెస్క్ : ఏడాదిపాటు బంగారం కొనుగోళ్లు తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు రానున్న ఆర్థిక మాంద్యాన్ని తట్టుకునేందుకు గోల్డ్ పై మరిన్ని ఆంక్షలు విధించేందుకు సిద్ధం అయింది కేంద్రం. బంగారం రుణాలకు సంబంధించిన పూర్తి వివరాల సమాచారం ఇవ్వాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే బంగారం దిగుమతులపై 15 శాతానికి పెంచగా.. తాజా నోటీసులను బట్టి భవిష్యత్తులో కూడా మరిన్ని పరిమితులు విధించే అవకాశాలు ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ గోల్డ్ మెటల్స్ లోన్స్ అనేది సామాన్య ప్రజలను ఉద్దేశించినది కాదు, ఇది బంగారు ఆభరణాల తయారీదారులు, ఎగుమతిదారులు కోసం అని అధికారులు చెబుతున్నారు. బ్యాంకులకు నగదుకు బదులు బంగారాన్ని లోన్ గా ఇస్తారు. అయితే ఇప్పుడా బంగారాన్ని బ్యాంకులు ఎలా వినియోగిస్తున్నాయి అనే సమాచారాన్ని తెలపాలంటూ బ్యాంకులకు నోటీసులు జారీ చేసింది రిజర్వ్ బ్యాంక్. కాగా ఈ వ్యవహారంపై మరింత సమాచారం అందాల్సి ఉంది.






