- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రెనేడ్ పేలి ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతి
జమ్మూ కశ్మీర్ ఉరీ సెక్టార్‌లోని ఆర్మీ క్యాంపులో ప్రమాదవశాత్తు గ్రెనెడ్ పేలి ఇద్దరు జవాన్లు మృతి చెందారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇండియన్ ఆర్మీలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు గ్రనేడ్ పేలి ఇద్దరు భారతీయ సైనికులు మరణించారు. అధికారిక వర్గాల కథనం ప్రకారం జమ్మూ కశ్మీర్‍లోని బారాముల్లా జిల్లా ఉరీ సెక్టార్, కమాల్‍కోట్ సైనిక శిబరంలోని సైనికుల ఆయుధ పరికరాలను ఒకరి నుంచి మరొకరికి అప్పగిస్తుండగా అకస్మాత్తుగా ఓ గ్రెనెడ్ పేలింది. ఈ తీవ్రమైన పేలుడు ధాటికి ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడగా బాధితులను వెంటనే సైన్యానికి చెందిన 92 బేస్ ఆసుపత్రికి తరలించారు. అయితే వారిని ఆసుపత్రికి చేర్చేలోపే వారు మరణిచినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు సంభవించిందని ఇందులో ఉగ్రవాదులు, ఇతర బాహ్య శక్తుల పాత్ర కానీ లేదని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. మృతి చెందిన సైనికుల కుటుంబాలకు ఆర్మీ ఉన్నతాధికారులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నిబంధనల ప్రకారం బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.






