- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం.. వ్యాపారి మృతి
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యాపారి మృతి చెందిన సంఘటన ఎన్‌హెచ్-44 రహదారిపై తొండుపల్లి కొత్త బ్రిడ్జి వద్ద బుధవారం జరిగింది.

దిశ, శంషాబాద్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యాపారి మృతి చెందిన సంఘటన ఎన్‌హెచ్-44 రహదారిపై తొండుపల్లి కొత్త బ్రిడ్జి వద్ద బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని పాతబస్తీ చంద్రాయణ్ గుట్ట ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇస్రార్ అహ్మద్ ఖాన్ (38) అనే వ్యక్తి వ్యాపారి. బుధవారం తెల్లవారుజామున సుమారు ఒంటి గంట సమయంలో తన R15 బైక్ పై కొత్తూరు వైపు నుంచి శంషాబాద్ వైపు బయలుదేరాడు. మార్గమధ్యలో సుమారు 1:30 గంటలకు తొండుపల్లి కొత్త బ్రిడ్జి వద్దకు చేరుకోగానే బైక్ అదుపుతప్పి స్కిడ్ అయింది. దీంతో ఇస్రార్ అహ్మద్ ఖాన్ రోడ్డుపై పడిపోయి తలకు, ఎడమ కన్నుకు, శరీరంలోని ఇతర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం శంషాబాద్‌లోని లిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి మేనమామ మహ్మద్ నూర్ ఉద్దీన్ ఫిర్యాదు మేరకు శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.






