- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉపాధి పనులకు వెళ్తూ ప్రమాదం.. కూలీ మహిళకు గాయాలు
రామ్‌రెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఉపాధి కూలీ సిలివేరు లక్ష్మమ్మ బుధవారం ఉపాధి హామీ పనులకు వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.

దిశ, మర్రిగూడ: మండలంలోని రామ్‌రెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఉపాధి కూలీ సిలివేరు లక్ష్మమ్మ బుధవారం ఉపాధి హామీ పనులకు వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తన భర్త నరసయ్యతో కలిసి ద్విచక్ర వాహనంపై పనులకు వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయే క్రమంలో వాహనం అదుపు తప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో లక్ష్మమ్మ తలకు గాయమవడంతో పాటు కుడిచేయి విరిగినట్లు తెలిసింది. వెంటనే తోటి ఉపాధి కూలీలు ఆమెను చికిత్స నిమిత్తం మర్రిగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న రామ్‌రెడ్డిపల్లి సర్పంచ్ లపంగి నరసింహ ఆసుపత్రికి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించారు. తక్షణ సహాయం కింద రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ సలివోజి యాదయ్య, గ్రామస్తులు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.






