- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > దేశం-విదేశం > ప్రధాని మోడీకి కేంద్ర క్యాబినెట్ ‘స్టాండింగ్ ఒవేషన్’.. ప్రత్యేక తీర్మానం ఆమోదం!
ప్రధాని మోడీకి కేంద్ర క్యాబినెట్ ‘స్టాండింగ్ ఒవేషన్’.. ప్రత్యేక తీర్మానం ఆమోదం!
భారత ప్రధానిగా నరేంద్ర మోడీ నిరంతరాయంగా ప్రధాని పదవిలో కొనసాగి చరిత్ర సృష్టించినందుకు కేంద్ర కేబినెట్ ‘స్టాండింగ్ ఒవేషన్’ ఇచ్చి ప్రత్యేక తీర్మానానికి ఆమోదం తెలిపింది.

X
దిశ, వెబ్ డెస్క్: భారతదేశంలో నిరంతరాయంగా అత్యంత సుదీర్ఘ కాలం పాటు పదవిలో కొనసాగుతూ, సరికొత్త చారిత్రాత్మక రికార్డు సృష్టించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi)ని కేంద్ర క్యాబినెట్ (Union Cabinet) ఘనంగా కొనియాడింది. ఈ అద్భుతమైన మైలురాయిని పురస్కరించుకుని బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రధాని మోడీని అభినందిస్తూ ఒక ప్రత్యేక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులందరూ లేచి నిలబడి, చప్పట్లతో ప్రధాని మోదీకి ‘స్టాండింగ్ ఒవేషన్’ (Standing Ovation) ఇచ్చి తమ గౌరవాన్ని చాటుకున్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం అంతర్జాతీయ వేదికపై అసాధారణ వృద్ధిని సాధించిందని, ఈ 4,399 రోజుల సుదీర్ఘ పాలన దేశ ప్రగతి పథంలో ఒక సువర్ణ అధ్యాయమని కేంద్ర మంత్రివర్గం కొనియాడింది.
Next Story






