- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం..
తిరుమలలో క్యూ కాంప్లెక్స్ కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి భక్తులు వెలుపల వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం.

దిశ, వెబ్ డెస్క్: కలియుగ వైకుంఠమైన తిరుమల కొండపై భక్తుల రద్దీ గత నాలుగు వారాలుగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఈ రోజు(బుధవారం) రద్దీ విపరీతంగా పెరింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. దీంతో టోకెన్లు లేని సాధారణ భక్తులు క్యూ కాంప్లెక్స్ వెలుపల కిలోమీటర్ల మేర లైన్లో వేచి ఉన్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం (Sarvadarsanam) లభించడానికి దాదాపు 18 గంటల సమయం పడుతోంది.
ఇదిలా ఉంటే మంగళవారం ఒకే రోజు మొత్తం 83,812 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 38,345 మంది భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకుని కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ద్వారా మొత్తం రూ. 4.31 కోట్లు గా ఆదాయం లభించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. కొనసాగుతున్న భక్తుల రద్ధీని దృష్టిలో ఉంచుకొని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు భక్తులకు క్యూలైన్లలోనే నిరంతరాయంగా మంచినీరు, పాలు, అన్నప్రసాద వితరణ సౌకర్యాలను కొనసాగిస్తున్నారు.






