- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ప్రాజెక్ట్స్ ప్రారంభించడానికి ఉత్సాహంగా ఉన్నాను.. బిగ్ అప్డేట్ ఇస్తూ కిచ్చా సుదీప్ పోస్ట్
కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న మనుషులకు, కొన్ని పరిస్థితులకు మన అవసర, మద్దతు చాలా అవసరం అవుతాయి. అందుకే ఈ చిన్న బ్రేక్ తీసుకున్నాను.

దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ గత ఏడాది ‘మ్యాక్స్’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. కానీ హిట్ అందుకోలేకపోయారు. ప్రస్తుతం భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ ‘బిల్లా రంగా బాషా’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీకి ‘విక్రాంత్ రోణ’ ఫేమ్ అనూప్ భండారి దర్శకత్వం వహించనున్నారు. ఈ హిట్ కాంబోలో మరో మూవీ రాబోతుండటంతో ‘బిల్లా రంగా భాషా’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం 2209వ సంవత్సరంనేపథ్యంలో సాగే ఒక సైన్స్ ఫిక్షన్, యాక్షన్, అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇందులో కిచ్చా సుదీప్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు టాక్. ఈ సినిమా కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కాబోతోంది. ‘హనుమాన్’ ఫేమ్ నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. కిచ్చా సుదీప్ సొంత బ్యానర్ సుప్రి యాన్వి పిక్చర్స్ స్టూడియో కూడా ఈ నిర్మాణంలో భాగస్వామిగా ఉంది. ఇదిలా ఉంటే.. కిచ్చా సుదీప్ ‘బిల్లా రంగా భాషా’తో పాటు మరో నాలుగు సినిమాలు చేస్తున్నట్లు గత కొద్ది కాలంగా పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. అందుకే కాస్త గ్యాప్ తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు నెట్టింట పలు పోస్టులు పెడుతున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, ఈ విషయంపై కిచ్చా సుదీప్ ట్విట్టర్ ద్వారా రియాక్ట్ అయ్యారు.
తన కెరీర్ పట్ల గానీ, అభిమానుల ప్రేమ పట్ల గానీ తాను ఎప్పుడూ అశ్రద్ధగా లేనని స్పష్టం చేస్తూనే, రాబోయే సినిమాలపై క్రేజీ అప్‌డేట్స్ ఇచ్చారు. "మీ అందరి మాటలు వింటున్నాను. సినిమాలకు దూరంగా ఉండి వేరే పనుల్లో బిజీగా ఉన్నానంటే.. దానికి కారణం మీ ప్రేమను గానీ, ఈ అద్భుతమైన కెరీర్‌ను గానీ తక్కువగా చూడటం కాదు. నాకు కథలు చెప్పడం, చిత్రాల ద్వారా మిమ్మల్ని అలరించడం కంటే ఇష్టమైన పని మరొకటి లేదు. నన్ను మళ్లీ సినిమాల్లో చూడాలని మీరు చేస్తున్న ఈ వేక్ అప్ ప్రయత్నం నిజంగా చాలా బాగుంది. నా పని పట్ల మీకున్న ప్రేమకు ఇది నిదర్శనం.. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అంటూ ఎమోషనల్ అయ్యారు. తాను సినిమాలకు విరామం ఇవ్వడానికి గల కారణాన్ని కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. "కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న మనుషులకు, కొన్ని పరిస్థితులకు మన అవసర, మద్దతు చాలా అవసరం అవుతాయి. అందుకే ఈ చిన్న బ్రేక్ తీసుకున్నాను. కానీ ఈ విరామంలో కూడా నేను ఖాళీగా లేను.. ఒక బాధ్యతాయుతమైన పనిలోనే ఉన్నాను" అని వివరించారు. అంతేకాకుండా అభిమానులను ఖుషీ చేసే వార్తను ప్రకటిస్తూ.. జూన్ 26వ తేదీ నుంచి ‘బిల్లా రంగా భాషా’ అనే చిత్రంతో మళ్లీ షూటింగ్ సెట్స్‌లో అడుగుపెట్టబోతున్నట్లు ప్రకటించారు. అక్కడి నుండి ఇక ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తానని ప్రామిస్ చేశారు. ఇప్పటికే 4 స్క్రిప్ట్‌లను లాక్ చేశానని, వాటన్నింటినీ వీలైనంత త్వరగా పట్టాలెక్కించడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. ఈ ప్రకటనతో సుదీప్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.






