ఆ తమిళ బ్లాక్‌బస్టర్ సినిమా లైఫ్‌టైమ్ కలెక్షన్లను క్రాస్ చేసిన ‘కరుప్పు’

by Pulgam srinivas |   (  Updated:2026-06-10 05:50:50  IST  )

‘కరుప్పు’ చిత్రం ‘అమరన్’ లైఫ్‌టైమ్ కలెక్షన్లను తాజాగా దాటేసినట్లు సమాచారం.

ఆ తమిళ బ్లాక్‌బస్టర్ సినిమా లైఫ్‌టైమ్ కలెక్షన్లను క్రాస్ చేసిన ‘కరుప్పు’
X

దిశ, వెబ్ డెస్క్: సూర్య హీరోగా తెరకెక్కిన ‘కరుప్పు’ చిత్రం ఇప్పటికే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటించగా, ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. చాలా కాలంగా సరైన విజయాల కోసం ఎదురుచూస్తున్న సూర్యకు ఈ సినిమా కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చిందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ‘కరుప్పు’ సినిమా ఓ తమిళ బ్లాక్‌బస్టర్ లైఫ్‌టైమ్ కలెక్షన్లను దాటేసినట్లు తెలుస్తోంది. కొంతకాలం క్రితం శివ కార్తికేయన్ హీరోగా నటించిన ‘అమరన్’ చిత్రం భారీ విజయాన్ని అందుకుని అద్భుతమైన వసూళ్లు సాధించింది.

అయితే ప్రస్తుతం ‘కరుప్పు’ సినిమా ఆ మూవీ లైఫ్‌టైమ్ కలెక్షన్లను అధిగమించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడుతూనే ఉందని సమాచారం. ఇదిలా ఉంటే, ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ కూడా ఖరారైంది. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 12వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఇక తెలుగులో ఈ సినిమా ‘వీరభద్రుడు’ అనే టైటిల్‌తో విడుదలై, టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కూడా మంచి విజయాన్ని అందుకుంది.

ఆ ప్రాజెక్ట్స్ ప్రారంభించడానికి ఉత్సాహంగా ఉన్నాను.. బిగ్ అప్డేట్ ఇస్తూ కిచ్చా సుదీప్ పోస్ట్

Next Story