- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సైలెంట్‌గా ‘బ్లాస్ట్’ విధ్వంసం.. బాక్సాఫీస్ వద్ద దూకుడు
బుక్‌మైషోలో 'బ్లాస్ట్' చిత్రానికి సంబంధించిన 1 మిలియన్‌కు పైగా టికెట్లు బుక్ అయినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్: సీనియర్ నటుడు, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘బ్లాస్ట్’. ఈ సినిమాలో ప్రీతి ముకుందన్, అభిరామి కీలక పాత్రల్లో నటించగా, సుభాష్ కె. రాజ్ దర్శకత్వం వహించారు. పెద్దగా అంచనాలు లేకుండా మే 28న విడుదలైన ఈ సినిమా విడుదల అనంతరం ప్రేక్షకులు మరియు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. దీంతో ఎలాంటి హడావిడి లేకుండానే ‘బ్లాస్ట్’ బాక్సాఫీస్ వద్ద నెమ్మదిగా మంచి వసూళ్లు రాబడుతున్నట్లు తెలుస్తోంది.
తాజాగా ఈ చిత్రబృందం కీలక అప్డేట్‌ను వెల్లడించింది. ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్‌మైషోలో ఈ సినిమాకు ఇప్పటివరకు 1 మిలియన్‌కు పైగా టికెట్లు బుక్ అయినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని బట్టి సినిమా సైలెంట్‌గా మంచి ఆదరణ పొందుతూ బాక్సాఫీస్ వద్ద బలమైన కలెక్షన్లు సాధిస్తోందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించారు.






