రేవంత్ రెడ్డి పాలనలో శాంతిభద్రతలు గాడి తప్పాయి: కవిత

by Ajay Maddhiboyina |

రేవంత్ రెడ్డి పాలనలో శాంతిభద్రతలు గాడి తప్పాయని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత, మాజీ ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిత్యం ఆడబిడ్డలపై అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.

రేవంత్ రెడ్డి పాలనలో శాంతిభద్రతలు గాడి తప్పాయి: కవిత
X

దిశ, వెబ్ డెస్క్: రేవంత్ రెడ్డి పాలనలో శాంతిభద్రతలు గాడి తప్పాయని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత, మాజీ ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిత్యం ఆడబిడ్డలపై అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ పోస్టులో ఆమె విమర్శలు కురిపించారు. ఖమ్మం నగరంలో 12ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టి, ఆమెను నాలుగో అంతస్తు నుండి తోసేసి హత్య చేయాలని ప్రయత్నించిన ఘటన కలచివేసిందన్నారు. జిల్లా కేంద్రంలో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయంటే మారుమూల ప్రాంతాల్లో మహిళలు, బాలికల భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతోందని పేర్కొన్నారు. పోలీసులు వేగంగా దర్యాప్తి పూర్తి చేసి నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

అదే విధంగా హైదరాబాద్ మహా నగరంలోని మల్కాజిగిరిలో భార్యను తుపాకీతో భర్త కాల్చి చంపడం అత్యంత దారుణం అని పేర్కొన్నారు. మూడు నెలల క్రితమే సదరు వ్యక్తి బహిరంగంగా తుపాకీతో బెదిరింపులకు పాల్పడినప్పుడే అరెస్ట్ చేసి ఉంటే ఈరోజు నిండు ప్రాణం బలి అయ్యేది కాదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని చెప్పడానికి, రేవంత్ రెడ్డి పాలనపై పట్టు కోల్పోయారని చెప్పడానికి ఈ ఘటన సాక్ష్యంగా నిలుస్తోందన్నారు. భార్యను హత్య చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని, ఈ ఘటనకు ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

Next Story