- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దిశ ఎఫెక్ట్.. వార్త వచ్చిన రెండు గంటల్లోనే స్పందించిన అధికారులు
రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్వయంగా గొడ్డలి చేతపట్టి ముళ్ళ కంచెను తొలగించడంపై దిశ దినపత్రికలో వచ్చిన కథనంపై అధికారులు స్పందించారు.

దిశ, మక్తల్: ట్యాంక్ బండ్ చెరువు కట్టపై ముళ్ళ కంచెతో, వాకింగ్ పాదాచార్యులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఇబ్బందులు చూసిన రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్వయంగా గొడ్డలి చేతపట్టి ముళ్ళ కంచెను తొలగిస్తున్నా దృశ్యాలను వార్తగా రాయడంతో వార్తకు మేల్కొన్న మున్సిపాలిటీ బుధవారం ఉదయం అధికారులు జేసీపీతో ముళ్ళకంచెను తొలగించేస్తున్నారు. సుందరీకరణలో భాగంగా ట్యాంక్ బండ్ అనుసంధానంగా ఉన్న కిలోమీటర్ చెరువు కట్టపై గ్రీన్ ఫీల్డ్ కోసం గతంలో నాటిన మొక్కలను సంరక్షించకపోవడం వల్ల ముళ్ళకంచె పెరిగింది. ఉదయం వాకింగ్‌కు వెళ్లే గృహిణులకు, మహిళలకు, యువతీ, యువకులకు ఇబ్బందిగా ఉందని ఆ విశ్రాంతి ఉద్యోగి మిత్రులతో కలిసి ముళ్ళకంచెను తొలగిస్తున్న దృశ్యాలను దిశలో పబ్లిష్ చేయడంతో మున్సిపల్ అధికారులు స్పందించి.. ముళ్ళకంచెను తొలగిస్తున్నారు. మున్సిపాలిటీతో పనిచేయించిన దిశకు మున్సిపాలిటీ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.






