ఇందిరమ్మ ఇళ్లకు డబ్బులు వసూళ్లు చేస్తే చర్యలు: వరంగల్ ఉమ్మడి కాంగ్రెస్ కమిటీ మాజీ ఉపాధ్యక్షులు

by Kodari Anjali |

ఇందిరమ్మ ఇళ్ల మంజూరీలో లబ్దిదారుల నుండి ఎవరైనా దళారులు డబ్బులు డిమాండ్ చేస్తే కఠిన చర్యలుంటాయని ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు హెచ్చరించారు.

ఇందిరమ్మ ఇళ్లకు డబ్బులు వసూళ్లు చేస్తే చర్యలు: వరంగల్ ఉమ్మడి కాంగ్రెస్ కమిటీ మాజీ ఉపాధ్యక్షులు
X

దిశ, మంగపేట: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేద ప్రజలకు అందజేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల మంజూరీలో లబ్దిదారుల నుండి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇంకా ఎవరైనా దళారులు డబ్బులు డిమాండ్ చేస్తే కఠిన చర్యలుంటాయని ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చింతా పరమాత్మ హెచ్చరించారు. బుధవారం విలేకర్లతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్కల నాయకత్వంలో పేద ప్రజల ఆత్మగౌరవం పెంచే దిశగా ఇస్తున్న ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి దళారులు లబ్ధిదారుల నుండి నగదు వసూలు చేసినచో తీవ్రమైన చర్యలు ఉంటాయన్నారు. ప్రజా పాలనలో పేద ప్రజల బాగు కోసం నివాస గృహములు కేటాయించిన వారి నుండి డబ్బులు అడిగితే లబ్దిదారులు గల్లా పట్టి నిలదీయాలని లేదా మాదృష్టికి తీసుకువస్తే మంత్రి సీతక్క దృష్టికి తీసుకెల్లి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Next Story