- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత వృద్ధి రేటు మరింత కుదించిన మూడీస్.. 6 శాతానికే పరిమితం
అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ (Moody's), 2026-27 ఆర్థిక సంవత్సరానికి (FY27) సంబంధించి భారత ఆర్థిక వృద్ధి అంచనాలను మరింత కుదించడం దేశీయ ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశమైంది.

దిశ, వెబ్ డెస్క్ : అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ (Moody's), 2026-27 ఆర్థిక సంవత్సరానికి (FY27) సంబంధించి భారత ఆర్థిక వృద్ధి అంచనాలను మరింత కుదించడం దేశీయ ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశమైంది. గతంలో భారత జీడీపీ వృద్ధిని 6.8 శాతంగా అంచనా వేసిన మూడీస్, తాజా నివేదికలో దానిని 6.0 శాతానికి కుదించింది. అంటే దాదాపు 0.8 శాతం మేర కోత విధించింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (FY26) మాత్రం వృద్ధి రేటు 7.6 శాతంగా బలంగా ఉంటుందని అంచనా వేసింది. వృద్ధి అంచనాలు తగ్గించినప్పటికీ, జీ20 దేశాలన్నింటిలోనూ భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని మూడీస్ స్పష్టం చేయడం కొంత సానుకూల అంశం.
ఈ వృద్ధి అంచనాల కోతకు ప్రధానంగా అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కారణమని మూడీస్ విశ్లేషించింది. ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో నెలకొన్న అనిశ్చితి వల్ల ముడిచమురు ధరలు పెరగడం భారత ఆర్థిక వ్యవస్థపై భారంగా మారింది. దీనివల్ల రవాణా ఖర్చులు పెరిగి, పరిశ్రమల ఇన్‌పుట్ వ్యయం భారమవ్వడమే కాకుండా, సాధారణ ప్రజల ప్రైవేట్ వినియోగం కూడా తగ్గుముఖం పట్టింది. ముడిచమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారత్ వంటి దేశాలకు, అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం వల్ల విదేశీ మారక ద్రవ్యం ఎక్కువగా ఖర్చవుతుంది, ఇది నేరుగా దేశ వాణిజ్య లోటుపై (Trade Deficit) ప్రభావం చూపుతోంది. అంతేకాదు ఇటీవల ఎస్‌అండ్‌పీ గ్లోబల్, ఏడీబీ కూడా భారత వృద్ధి రేటు గణనీయంగా పడిపోనుందని అంచనా వేసాయి.






