- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వామ్మో! ఓ వైపు కోతులు, మరోవైపు కుక్కలు.. భయాందోళనలో ప్రజలు
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంతో పాటు పలు గ్రామాల్లో ప్రజలు బయటకు రావాలంటే భయబ్రాంతులకు గురవుతున్నారు.

దిశ,గంభీరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంతో పాటు పలు గ్రామాల్లో ప్రజలు బయటకు రావాలంటే భయబ్రాంతులకు గురవుతున్నారు. వివిధ పనుల నిమిత్తం బయటకు రావాలన్నా, పోవాలన్నా కుక్కలు, కోతులు దాడి చేస్తాయని బెదిరిపోతున్నారు. ఒకటి రెండు కాదు పదుల సంఖ్యలో వీధుల్లో తిరుగుతూ ప్రజలపైకి దూకుతున్నాయి. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అటవీ ప్రాంతాల్లో ఉండాల్సిన కోతులు నివాస ప్రాంతాలకు వచ్చి గృహాలను గుల్ల చేస్తున్నాయని మహిళలు అంటున్నారు. గతంలో ఇదే తరహాలో కోతులు తిరగ్గా, మండల కేంద్రంలో కొన్ని సంఘాలు కలిసి తల కొన్ని డబ్బులు జమ చేసుకొని కోతులను పట్టించారు. ఆ తర్వాత లోకల్ ఎలక్షన్ వచ్చాయి, మండలంతో పాటు గ్రామాల్లో ఎలక్షన్ లో కొందరు పోటీ చేసే అభ్యర్థులు ప్రజలకు కోతులు, కుక్కలు నుంచి ఎటువంటి సమస్య ఉండదని హామీలు కూడా ప్రకటించారు.
కానీ ఆ హామీలు కొన్ని రోజులకే పరిమితమయ్యాయి. ఇప్పుడు ఏ ఒక్క అధికారి కానీ పాలకవర్గం గాని కుక్కలు గాని కోతులను కానీ పట్టించుకున్న నాధుడే లేకపోయాడని ప్రజలు వాపోతున్నారు. మళ్లీ కోతుల గుంపులు వచ్చాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు భయంతో బయటకు రాలేని పరిస్థితి ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక వైపు కోతుల బెడద అయితే మరో వైపు కుక్కల గుంపు తోడైంది. కుక్కలు కూడా పదుల సంఖ్యలో భౌ..భౌ.. అంటూ ప్రజలను పరుగులు పెట్టిస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కుక్క దాడిలో ప్రాణాలు, గాయాలైన ఘటనలు అనేకం ఉన్నాయి. అలాంటి ఘటనలు ఇక్కడ జరగకముందే అధికారులు గ్రామ పంచాయతీ పాలకవర్గం స్పందించి కోతులు, కుక్కలను పట్టుకొని అటవీ ప్రాంతాల్లో వదిలేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.






