- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MonalisaMonalisa: ఇంటర్నెట్‌ను ఊపుతోన్న పూసలమ్మే మోనాలిసా డ్యాన్స్.. వీడియో వైరల్
నీలి కళ్ల అందంతో సోషల్ మీడియాలోని జనాలందర్ని మెస్మరైజ్ చేస్తోంది మోనాలిసా(Mona Lisa).

దిశ, వెబ్‌డెస్క్: నీలి కళ్ల అందంతో సోషల్ మీడియాలోని జనాలందర్ని మెస్మరైజ్ చేస్తోంది మోనాలిసా(Mona Lisa). కుంభమేళా పుణ్యమా అంటూ ఈ నటి క్రేజ్ ఓ రేంజ్‌కు వెళ్లిపోయింది. దీంతో మహాకుంభమేళా(Mahakumbh Mela)లో పూసల దండలు అమ్ముకున్న ఈ అమ్మాయికి బాలీవుడ్ దర్శకుడు(Bollywood director) బంపర్ ఆఫర్ ఇచ్చాడు.
తన అమాయకత్వం, కాటుక దిద్దిన తేనె కళ్లు దీనికి కారణమని చెప్పుకోవచ్చు. మోనాలిసా రూపం, తన అమాయకత్వం చూసి ఫిదా అయ్యానని కూడా దర్శకుడు సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. తన మూవీ కోసం మోనాలిసా లాంటి అమ్మాయినే వెతుకుతున్నానంటూ తెలిపాడు. ఈ దర్శకుడు అనుకున్న పాత్రకు మోనాలిసా కరెక్ట్‌గా సెట్ అవుతుందని అన్నారు.
ఈమె మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని ఇండోర్(Indoor)కు చెందిన అమ్మాయి. మోనాలిసా ఓవర్ నైట్ ఫుల్ ఫేమ్ అవ్వడంతో ఈమెను చూడానికి చాలా మంది అక్కడకు వెళ్లారు. తనతో ఫొటోలు, వీడియోలు కూడా తీసుకున్నారు. త్వరలో ఈ ముద్దుగుమ్మ సనోజ్ మిశ్రా దర్శకత్వం వహిస్తోన్న ది డైరీ ఆఫ్ మణిపూర్ (The Diary of Manipur) సినిమాలో కనిపించనుంది కూడా.
ఇక మోనాలిసాకు బాబీ చెమ్మనూర్(Bobby Chemmanur) ఓ డైమండ్ నెక్లెస్ బహుమతి కూడా ఇచ్చాడు. తాజాగా ఈ బ్యూటీ డ్యాన్స్ చేస్తోన్న ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హిందీ సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులు వేయడంతో మోనాలిసాలో ఈ టాలెంట్ కూడా ఉందా? అంటూ నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.






