ప్రొఫెస‌ర్ విశ్వామిత్రగా మోహ‌న్ బాబు.. ఫస్ట్ లుక్

by Disha Web Desk 7 |
ప్రొఫెస‌ర్ విశ్వామిత్రగా మోహ‌న్ బాబు.. ఫస్ట్ లుక్
X

దిశ, సినిమా : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అంటేనే భారీ డైలాగులకు ప్రసిద్ధి. కోపం, ఆవేశం, సెంటిమెంట్, కామెడీ టైమింగ్.. ఆయనను పరిపూర్ణ నటుణ్ణి చేశాయనడంలో సందేహం లేదు. ఇక అప్పటి హీరోల్లో కొంత మంది ప్రస్తుతం విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే అడపాదడపా సినిమాలు చేస్తున్న మోహన్ బాబుకు 'స‌న్ ఆఫ్ ఇండియా' రూపంలో ఎదురు దెబ్బతగిలింది.

ఆయన లీడ్ రోల్‌లో నటించిన ఈ సినిమాకు మెదటి రోజున ఒక్కో థియేట‌ర్‌లో కనీసం ప‌ది టికెట్లు కూడా అమ్ముడు పోలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఒక‌ప్పుడు హీరోగా, నిర్మాత‌గా భారీ విజయాలు చవిచూసిన ఆయ‌న‌కు ఇలాంటి ప‌రిస్థితి రావ‌డం అభిమానుల‌ను సైతం నిరాశకు గురిచేసింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కూతురు మంచు లక్ష్మితో కలిసి 'అగ్ని న‌క్షత్రం' అనే సినిమా చేస్తున్నాడు. ప్రతీక్ ప్రజోష్ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న చిత్రంలో మోహన్ బాబు ప్రొఫెసర్ పాత్రలో కనిపించనున్నారు. అయితే తాజాగా రిలీజైన టైటిల్ మోషన్ పోస్టర్‌ను బట్టి చూస్తుంటే మోహన్ బాబు 'ది బ్యాక్' అనిపిస్తోంది.



Next Story

Most Viewed