- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోడీ విమానానికి ఎఫ్-16లతో ఎస్కార్ట్
ప్రధాని నరేంద్ర మోడీ తన ఐదు దేశాల పర్యటనలో భాగంగా మొదటి దశలో యూఏఈలోని అబుధాబి చేరుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : ప్రధాని నరేంద్ర మోడీ తన ఐదు దేశాల పర్యటనలో భాగంగా మొదటి దశలో యూఏఈలోని అబుధాబి చేరుకున్నారు. కాగా ప్రధాని మోడీ విమానం యూఏఈ గగనతలంలోకి ప్రవేశించగానే, ఆ దేశ వైమానిక దళానికి చెందిన శక్తివంతమైన F-16 డెజర్ట్ ఫాల్కన్ యుద్ధ విమానాలు ఆయన విమానానికి ఎస్కార్ట్ గా నిలిచాయి. సాధారణంగా అత్యంత సన్నిహిత మిత్రదేశాల అధినేతలకు మాత్రమే ఇచ్చే ఈ అరుదైన గౌరవం, అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి ఉన్న ప్రాముఖ్యతను, ప్రధాని మోదీ పట్ల యూఏఈకి ఉన్న గౌరవాన్ని ప్రతిబింబిస్తోంది. ఇక అబుధాబి విమానాశ్రయంలో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ప్రోటోకాల్‌ను పక్కన పెట్టి స్వయంగా వచ్చి ప్రధాని మోదీకి సాదర స్వాగతం పలికారు. కొద్దిసేపటి క్రితమే ఇరు దేశాల మధ్య ఇంధన భద్రత, వాణిజ్యం, రక్షణ రంగాల్లో కుదుర్చుకోబోయే కీలక ఒప్పందాలపై కీలక సమావేశం మొదలైంది.






