రాష్ట్రంలో రెండు రోజులపాటు మోస్తరు నుండి భారీ వర్షాలు

by Muthe.Rajitha |

రాష్ట్రంలో రానున్న రెండు రోజులపాటు మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది.

రాష్ట్రంలో రెండు రోజులపాటు మోస్తరు నుండి భారీ వర్షాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో నేడు, రేపు మోస్తరు నుండి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో గాలివేగం గంటకు 30 నుండి 40 కి.మీ వేగంతో కురుస్తాయని పేర్కొంది. రాష్ట్రంలో ఆదిలాబాద్, కుమరం భీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అలాగే రాబోయే 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుండి 4 డిగ్రీల మేర తగ్గే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ తెలిపింది.

వివిధ ప్రాంతాలలోనమోదైన ఉష్ణోగ్రతల వివరాలు:

ప్రాంతం నమోదైన ఉష్ణోగ్రత(డిగ్రీ సెల్సియస్ లలో)

ఆదిలాబాద్ - 39.3

భద్రాచలం - 35.2

హకీంపేట్ - 38.6

దుండిగల్ - 37.4

హన్మకొండ - 34

హైదరాబాద్ - 37.6

ఖమ్మం - 35

మహబూబ్ నగర్ - 37.8

మెదక్ - 36.2

నల్గొండ - 35.8

నిజామాబాద్ - 38.4

రామగుండం - 36

పటాన్చెరు - 36.2

రాజేంద్రనగర్ - 37

హయత్ నగర్ - 37

Next Story