- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో మూడు రోజులు మోస్తరు నుండి భారీ వర్షాలు
రాష్ట్రంలో రానున్న మూడు రోజులు మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రాగల మూడు రోజులు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కర్ణాటక, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. మెదక్ జిల్లా నర్సాపూర్ లో 3 సెం.మీ, రేగోడులో 3 సెం.మీ, నర్సాపూర్ అర్బన్ లో 2 సెం.మీ, కామారెడ్డి జిల్లా దోమకొండలో 2 సెం.మీ, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా దుండిగల్ లో 1 సెం.మీ, సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ లో 1 సెం.మీ, కామారెడ్డి జిల్లా భిక్నూర్ లో 1 సెం.మీ చొప్పున వర్షాపాతం నమోదైంది.
నేడు రాష్ట్రంలోని ఆదిలాబాద్, కుమరం భీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల్ జిల్లా లలో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.






