సందట్లో సడేమియా... జాతరలో మొబైల్ ఛార్జింగ్ దందా

by Muthe.Rajitha |

జాతరలో కాదేది వ్యాపారానికి అనర్హం అన్నట్టుగా మారింది.

సందట్లో సడేమియా... జాతరలో మొబైల్ ఛార్జింగ్ దందా
X

దిశ, వెబ్ డెస్క్ : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ అయిన మేడారం మహా జాతర కన్నుల పండుగగా జరుగుతోంది. లక్షలాదిగా భక్తులు సమ్మక్క సారక్కను దర్శించుకునేందుకు బారులు తీరారు. మేడారం ఎటుచూసినా జనసంద్రంగా మారింది. అయితే జాతరలో కాదేది వ్యాపారానికి అనర్హం అన్నట్టుగా మారింది. జాతరలో మొక్కులు తీర్చుకోడానికి వచ్చిన భక్తులకు జంపన్న వాగు వద్ద 50 రూపాయలకు బకెట్ వేడినీళ్లు అమ్మడం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అలాగే ఫోన్ ఛార్జింగ్ పాయింట్లతో కూడా వ్యాపారం మొదలు పెట్టారు. కొందరు జాతరలో మైబైల్ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి, అందుకుగాను ఒక్కో ఫోనుకు 50 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇది మాత్రమే కాదు స్నానఘట్టాల వద్ద బ్యాగులకు కాపలా అంటూ.. ఒక్కో బ్యాగుకు 50 రూపాయలు వసూలు చేస్తూ ఉపాధి పొందుతున్నారు.

Next Story