పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి: ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి

by Jakkula.Mamatha |

పారిశుద్ధ్య నిర్వహణలో యాంత్రిక యంత్రాలను వినియోగించి, శరవేగంగా శుభ్రం చేయాలని ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు.

పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి  సారించాలి: ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి
X

దిశ,మేడ్చల్ బ్యూరో: పారిశుద్ధ్య నిర్వహణలో యాంత్రిక యంత్రాలను వినియోగించి, శరవేగంగా శుభ్రం చేయాలని ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. పరిశుభ్రత చేపట్టిన అనంతరం బ్యానర్లు, ఫ్లెక్సీలు, ఇతర ప్రచార సామాగ్రి ఆలస్యం లేకుండా తరలించి, రహదారులు, ఫుట్ పాత్‌లను పరిశుభ్రంగా, రాకపోకలకు అవరోధాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంగళవారం శానిటేషన్ అదనపు కమిషనర్ రఘు ప్రసాద్, బోయిన్ పల్లి డిప్యూటీ కమిషనర్ డాకు నాయక్ , డీఈ, ఏఈ, రామ్‌కీ సంస్థ ప్రతినిధులతో కలిసి బేగంపేట ప్రాంతంలో కమిషనర్ పర్యటించారు. ఈ క్రమంలో పారిశుద్ధ్య నిర్వహణ, రహదారులు, ఫుట్‌పాత్‌లపై ఎలాంటి చెత్త, వ్యర్థాలు పేరుకుపోకుండా చూడాలన్నారు. అనంతరం కమిషనర్ సికింద్రాబాద్‌లోని రైల్ నిలయం కాలనీలో కొనసాగుతున్న రహదారి అభివృద్ధి పనులను పరిశీలించి, పక్కనే నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలు పేరుకుపోవడాన్ని గమనించి తక్షణమే తొలగించాలన్నారు.

Next Story