- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేజీబీవీ కల్వకుర్తి పాఠశాలను సందర్శించిన డీఈఓ
విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) రమేష్ కుమార్ అన్నారు.

దిశ, కల్వకుర్తి: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) రమేష్ కుమార్ అన్నారు. మంగళవారం కల్వకుర్తి లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థినులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం, ఆహార నాణ్యతను స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహారాన్ని పరిశీలించి, మెనూ ప్రకారం ప్రతిరోజూ నాణ్యమైన, పరిశుభ్రమైన, రుచికరమైన ఆహారాన్ని అందించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూను తప్పనిసరిగా అమలు చేస్తూ విద్యార్థినుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పోషకాహారం అందించాలన్నారు.
వంటశాల పరిశుభ్రత, ఆహార పదార్థాల నాణ్యత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వవద్దని ఆదేశించారు. అనంతరం పాఠశాల నిర్వహణ, విద్యార్థినులకు కల్పిస్తున్న సౌకర్యాలు, హాస్టల్ నిర్వహణ పై ఆరా తీశారు. విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని మౌలిక వసతులు కల్పించడంతో పాటు నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన ఆహారం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మండల విద్యాధికారి శంకర్ నాయక్, పాఠశాల ప్రత్యేక అధికారిని రమాదేవి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






