- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముందస్తు సమాచారం ఆధారంగానే చోరీ చేశారా..?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం కొత్తదంతెనం గ్రామంలో భారీ చోరీ చోటుచేసుకుంది.

దిశ, దుమ్ముగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం కొత్తదంతెనం గ్రామంలో భారీ చోరీ చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు వెళ్లిన సమయంలోనే గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించి నగదు, బంగారు ఆభరణాలను అపహరించారు. ఆధారాలు దొరకకుండా ఉండేందుకు సీసీ కెమెరా వైర్లు కట్ చేయడంతో పాటు మరో సీసీ కెమెరాను సైతం ఎత్తుకెళ్లినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. బాధితుడు ఎ. ఏసుదాసు ఫిర్యాదు మేరకు.. గత జూన్ 14న తన కుమారుడి వద్దకు హైదరాబాద్‌కు వెళ్లగా, మంగళవారం ఉదయం ఇంటికి చేరుకుని చూడగా ప్రధాన ద్వారం తాళం పగులగొట్టి ఉంది. లోనికి వెళ్లి పరిశీలించగా ఇంట్లోని నాలుగు బీరువాలను ధ్వంసం చేసి అందులో ఉన్న రూ.7.50 లక్షల నగదు, మూడు తులాల బంగారు మాటులు, ఒక డైమండ్ ఉంగరం, ఒక తులం బంగారు ఉంగరం, 10 చిన్న బంగారు ఉంగరాలు, రెండున్నర తులాల బంగారు నెక్లెస్ అపహరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే ఇంట్లోని మంచంపై కత్తులు, బాకులు, టూల్‌కిట్‌ను వదిలివెళ్లినట్లు తెలిపారు.సమాచారం అందుకున్న సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వెంకటప్పయ్య క్లూస్ టీంతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆధారాలను సేకరించి బాధితుడి నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఇంటి పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించగా వైర్లు కట్ చేసి ఉండగా, మరో సీసీ కెమెరా కనిపించకపోవడంతో దానిని దుండగులు తీసుకెళ్లినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో చోరీకి ముందు ఇంటిపై రెక్కీ నిర్వహించారా? కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిన సమాచారంతోనే పథకం ప్రకారం ఈ చోరీకి పాల్పడ్డారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






