- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధికారులకు మంగళవారం కలిసి రాదా..?
ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా బదిలీ పై కొత్త స్థానంలో బాధ్యతలు స్వీకరించే అధికారులు, సాధారణంగా మంచి రోజు, తిథి, వారాన్ని పరిగణనలోకి తీసుకుంటారనే అభిప్రాయం చాలా కాలంగా ఉంది.

దిశ, సూర్యాపేట ప్రతినిధి : ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా బదిలీ పై కొత్త స్థానంలో బాధ్యతలు స్వీకరించే అధికారులు, సాధారణంగా మంచి రోజు, తిథి, వారాన్ని పరిగణనలోకి తీసుకుంటారనే అభిప్రాయం చాలా కాలంగా ఉంది. అధికారికంగా అలాంటి నిబంధన ఏది లేకపోయినా, వ్యక్తిగత సెంటిమెంట్లు, నమ్మకాల కారణంగా కొందరు అధికారులు కొన్ని రోజులలో కొత్త పోస్టింగ్‌లో చేరేందుకు ఆసక్తి చూపరనే చర్చ తరచూ వినిపిస్తుంది. ఇటీవల సూర్యాపేట జిల్లాలో పలువురు ఎస్సైలకు సోమవారం బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
సాధారణంగా బదిలీ ఉత్తర్వులు అందిన వెంటనే లేదా కొన్ని గంటల్లోనే కొత్త స్థానంలో విధుల్లో చేరే అధికారులు, ఈసారి మాత్రం మంగళవారం కావడంతో విధుల్లో చేరకుండా మరుసటి రోజు చేరేందుకు వేచి చూసినట్లు సమాచారం. దీంతో "మంగళవారం కొత్త పోస్టింగ్‌లో చేరేందుకు అధికారులు ఎందుకు వెనుకంజ వేస్తున్నారు ?", "మంగళవారం కలిసి రాదనే సెంటిమెంటే కారణమా ?" అనే చర్చ ప్రజల్లో సాగుతోంది. అధికారికంగా దీని పై ఎలాంటి ప్రకటన లేకపోయినా, కొందరు అధికారులు వ్యక్తిగత విశ్వాసాల మేరకే నిర్ణయాలు తీసుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, బదిలీ ఉత్తర్వుల్లో నిర్దేశించిన గడువులోపు విధుల్లో చేరితే సరిపోతుందని, ఏ రోజు చేరాలనేది అధికారుల వ్యక్తిగత నిర్ణయమేనని పలువురు పేర్కొంటున్నారు. మరోవైపు ప్రజాపాలనలో మూఢనమ్మకాలు, సెంటిమెంట్లకు చోటు ఉండకూడదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.






