- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైడ్రా కమిషనర్‌కు శాలరీ గాంధీ భవన్ ఇస్తున్నదా: ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు
హైడ్రా కమిషనర్‌కు జీతం గాంధీ భవన్ ఇస్తోందా? ప్రొటోకాల్ పాటించకుండా ఎమ్మెల్సీలను అవమానిస్తారా అని శంభిపూర్ రాజు నిప్పులు చెరిగారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కూకట్‌పల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్న హైడ్రా కార్యక్రమంలో శాసనమండలి సభ్యులకు అవమానం జరిగిందని.. ప్రొటోకాల్ పాటించలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు (MLC Shambhipur Raju) అన్నారు. శాసనమండలిలో బుధవారం ఆయన మాట్లాడారు. హైడ్రా కమిషనర్‌కు గాంధీ భవన్ నుండి శాలరీ ఇస్తున్నారా? ప్రభుత్వం నుండి వస్తున్నదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు జరిగిన ఈ అవమానంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించని గవర్నర్ ప్రసంగానికి ఎలా ధన్యవాదాలు చెప్పాలని నిలదీశారు.
ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయకపోగా కట్టిన ఇళ్లు కూలగొట్టి ప్రజలను రోడ్ల మీదకు తీసుకువస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం దగ్గర పైసలు లేవనే సీఎం.. మూసీ ప్రాజెక్టుకు లక్ష 50 వేల కోట్లు ఎందుకని ప్రశ్నించారు. తెచ్చుకున్న తెలంగాణ పదేళ్లలో అభివృద్ధి చెందితే నేడు తిరోగమన దిశగా పోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రాకు పేదలు, మధ్యతరగతి వాళ్లే కనిపిస్తున్నారని.. పెద్దల అక్రమ కట్టడాలు ఎందుకు కనిపిస్తలేవని ప్రశ్నించారు.






